నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన నారాయణ విద్యార్థులు
విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించిన వీబీఆర్_
నీట్ ఫలితాల్లో నారాయణ విజయవిహారం
నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన నారాయణ విద్యార్థులు
విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించిన వీబీఆర్
విడుదలైన నీట్-2025 ఫలితాల్లో.. నారాయణ విజయవిహారం చేసిందని.. జాతీయస్థాయి ఓపెన్ క్యాటగిరిలో 161, 253, 323, 515, 546, 804, 955, 962 ర్యాంకులతో 1000లోపు 9 ర్యాంకులు.. అలాగే.. వివిధ కేటగిరిలలో 100లోపు 13, 17, 38 ర్యాంకులు సాధించి జాతీయస్థాయిలో మరోసారి అగ్రస్థానంలో నిలిచి.. మరెవ్వరూ అందుకోలేని విజయాన్ని నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమి సొంతం చేసుకుందని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజరు వేమిరెడ్డి విజయ్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు హర్నాథపురంలోని నారాయణ కళాశాలలో విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. విజయభాస్కర్‌రెడ్డితోపాటు ఏజీఎం, డీజీఎంలు, ప్రిన్సిపల్స్, అధ్యాపక సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈసందర్భంగా నారాయణ జూనియర్ కాలేజస్ కోర్ డీన్ జయకుమార్ రాయుడు మాట్లాడారు. ఇంటర్, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ ఫలిలాల్లో నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆయన తెలిపారు. ఈ నీట్ ఫలితాల్లోనూ జాతీయ స్థాయిలో నారాయణ విజయవిహారం చేసినట్లు ఆయన వెళ్లడించారు. అనంతరం ర్యాంకులు సాధించిన వారి వివరాలను ఆయన వెళ్లడించారు.