ఇప్పటికే 50 శాతం చెత్తను రీసైక్లింగ్ చేశాం – మంత్రి నారాయణ
అల్లీపురం డంపింగ్ యార్డులో లెగసి వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద పనులు పరిశీలించిన మంత్రి
రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశం
ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
- ఇప్పటికే 50 శాతం చెత్తను రీసైక్లింగ్ చేశాం
- మంత్రి నారాయణ
- అల్లీపురం డంపింగ్ యార్డులో లెగసి వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద పనులు పరిశీలించిన మంత్రి
- రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశం
అల్లీపురం డంపింగ్ యార్డ్ లెగసి వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ ని మంత్రి నారాయణ పరిశీలించారు. రీ సైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.
అక్టోబర్ రెండు కల్లా ఆంధ్రప్రదేశ్ ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని…ఇప్పటికే 50 శాతం చెత్తను రీసైక్లింగ్ చేశామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డ్ లోని లెగసి వేస్ట్ వేనేజ్ మెంట్ ప్లాంట్ వద్ద పనులను కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులతో కలసి మంత్రి పరిశీలించారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ…గత వైసీపీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రానికి వదిలి వెళ్ళిందని ఎద్దేవా చేశారు. తల్లికి వందనంపై వైఎస్సార్సీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. అర్థపర్థం లేని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని…రానున్న రెండేళ్లలో రాజధాని పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.