కల్తీ లేని వార్తలు సంచలనం రేపే కథనాలు_
హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలకు న్యాయం చేసే దిశగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ద్వారా నేటికీ ఒక బిడ్డకు కూడా తల్లికి వందనం నగదు జమ కాలేదని, ఇది తల్లికి వందనం కాదు…తల్లికి వంచన పథకం అని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి యద్దేవా చేశారు. సూపర్ సిక్స్ పథకాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైద్యాధికారులకి సూచించారు. నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు.
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు రైతు సేవా కేంద్రాలలో ఈకేవైసి చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి గా శశిధర్ తెలిపారు. సంగం మండల వ్యవసాయాధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి రావాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకి స్కూల్ కిట్లను ఆమె పంపిణీ చేశారు.
ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని పీడీఎస్యూ మాజీ రాష్ట్ర నాయకుడు భాస్కర్ ఆరోపించారు. కావలిలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
అంతర్జాతీయ ఫాదర్స్ డే వేడుకలు ఓవెల్ 14 స్కూల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల మధ్య అనివాభావ సంబంధాన్ని మరింత పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహద పడుతాయని ప్రిన్సిపాల్ రామాంజనేయులు చెప్పారు.
అన్నదాత సుఖీభవ పథకం ప్రతీ రైతుకి అందేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారి ఏడీఏ అనిత సూచించారు. కోవూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఆమె వ్యవసాయ శాఖ అధికారులు, వీఏఏలతో సమావేశం నిర్వహించారు.
ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధానమైన సిరిమానోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని సంగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు వెల్లడించారు. బియ్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.