ఓవెల్ 14లో ఘనంగా ఫాదర్స్ డే

విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు – తల్లిదండ్రులకు పాదపూజ చేసిన విద్యార్థులు

ఓవెల్ 14లో ఘనంగా ఫాదర్స్ డే

  • విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు
  • తల్లిదండ్రులకు పాదపూజ చేసిన విద్యార్థులు


అంతర్జాతీయ ఫాదర్స్ డే వేడుకలు ఓవెల్ 14 స్కూల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల మధ్య అనివాభావ సంబంధాన్ని మరింత పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహద పడుతాయని ప్రిన్సిపాల్ రామాంజనేయులు చెప్పారు.


నెల్లూరు పొదలకూరురోడ్డులోని ఓవెల్ 14 పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పిల్లలకు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు విద్యార్థుల చేత పాద పూజ చేయించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓవెల్ స్కూల్ ప్రిన్సిపాల్ రామాంజనేయులు మాట్లాడుతూ… పిల్లలు, తల్లిదండ్రుల మధ్య అభినాభావ సంబంధాలను, ప్రేమానురాగాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహద పడుతాయన్నారు. ఓవెల్ విద్యా సంస్థల్లో చదువుతతోపాటు, మానవ విలువల కాపాడడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సీఎండీ ఆర్ వేణు, సీఈవో ప్రమీలా, జీఎం మహదేవన్, ఈడీ బాలు, డీజీఎం శ్రీనివాస యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *