వ్యవసాయ శాఖాధికారి ఏడీఏ అనిత_
అన్నదాత సుఖీభవ ప్రతీ రైతుకి అందాలి
- వ్యవసాయ శాఖాధికారి ఏడీఏ అనిత
అన్నదాత సుఖీభవ పథకం ప్రతీ రైతుకి అందేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారి ఏడీఏ అనిత సూచించారు. కోవూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఆమె వ్యవసాయ శాఖ అధికారులు, వీఏఏలతో సమావేశం నిర్వహించారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయలో వ్యవసాయ శాఖ అధికారి ఏ డి ఏ అనిత ఆధ్వర్యంలో మండల, గ్రామస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ శాఖ అధికారులకు, విఏఏలకు రైతులకు సంబంధించి ఈ కేవైసీ చేయించే విషయంలో పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రతి రైతుకు అందేలా చూడాలన్నారు. విఏఏలు రైతులకు తప్పనిసరిగా ఈ- కేవైసీ చేయాల్సివల్సిందిగా సూచించారు… ఈ కార్యక్రమంలో కోవూరు డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులు రజిని, విజయలక్ష్మి, లక్ష్మి, శ్రీహరి, శశిధర్. వి ఏ ఏ లు పాల్గొన్నారు….