మెరుగైన వైద్యం అందించాలని అధికారులకి సూచన
బాధితుల్ని పరామర్శించిన సోమిరెడ్డి…
- మెరుగైన వైద్యం అందించాలని అధికారులకి సూచన
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైద్యాధికారులకి సూచించారు. నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి సమీపంలోని మల్లుగుంట సంఘం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులు నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య యోగక్షేమాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సోమిరెడ్డి వైద్యాధికారులకు సూచించారు. ఆయన వెంట పలువురు పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.