వీపీఆర్ లో విలువలతో కూడిన విద్య

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి_ _విపిఆర్ విద్య పాఠశాలలో విద్యార్థులకు కిట్ల పంపిణీ_

వీపీఆర్ లో విలువలతో కూడిన విద్య…

  • ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
  • విపిఆర్ విద్య పాఠశాలలో విద్యార్థులకు కిట్ల పంపిణీ


ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి రావాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకి స్కూల్ కిట్లను ఆమె పంపిణీ చేశారు.


విలువలతో కూడిన విద్యను అందించడమే విపిఆర్ విద్య పాఠశాల లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కనుపర్తిపాడులోని విపిఆర్ విద్య పాఠశాలలో స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది నూతనంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే, ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రశాంతి రెడ్డి కిట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విలువలతో కూడిన విద్యను నిరుపేద పిల్లలకు అందించేందుకు 2016లో నెల్లూరు పార్లమెంటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ విద్య పాఠశాలను ప్రారంభించారన్నారు. స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పేద పిల్లలకు మంచి విద్యను అందిస్తూ పాఠశాల ముందుకు సాగుతుందన్నారు. పిల్లల విద్యాభివృద్ధిపై ఆయా తల్లిదండ్రులు తప్పకుండా దృష్టి సారించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *