మీడియా సమావేశంలో నేదురుమల్లి కామెంట్స్_
తల్లికి వందనం కాదు వంచన
- మీడియా సమావేశంలో నేదురుమల్లి కామెంట్స్
ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ద్వారా నేటికీ ఒక బిడ్డకు కూడా తల్లికి వందనం నగదు జమ కాలేదని, ఇది తల్లికి వందనం కాదు…తల్లికి వంచన పథకం అని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి యద్దేవా చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సూపర్ సిక్స్ పథకాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు