అర్హులందరికి ఇళ్ల స్థలాలు కేటాయించండి

హౌసింగ్, రెవెన్యూ అధికారుల సమీక్షించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

అర్హులందరికి ఇళ్ల స్థలాలు కేటాయించండి

  • హౌసింగ్, రెవెన్యూ అధికారుల సమీక్షించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలకు న్యాయం చేసే దిశగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


సొంత ఇళ్ళులేని నిరుపేదలను గుర్తించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు కావాలని దాదాపు 1600 మంది దరఖాస్తులు చేసుకొని ఉన్నారన్నారు. రెవెన్యూ, హౌసింగ్ అధికారులు పరస్పర సమన్వయంతో అర్హులను గుర్తించి వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో మిగిలి ఉన్న ప్లాట్లు గుర్తించి అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. పేదలకు న్యాయం చేసే దిశగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను అరికట్టాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాల్, హౌసింగ్ డిఇ వెంకటేశ్వర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తహసీల్దారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *