తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం ఇందుకూరుపేట కూటమి నేతలు
విమాన ప్రమాదం బాధాకరం…
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం ఇందుకూరుపేట కూటమి నేతలు
గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇందుకూరుపేట మండల కూటమి నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ లోని BJ మెడికల్ కాలేజీ మెస్ పై విమానం కూలడం తో విమానం లోని ప్రయాణికుల తో పాటు మెస్ లోన మెడికోలు మరణించడం బాధాకరమన్నారు. 242 మంది తమ ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని చెప్పారు. క్షతగాత్రులకి వెంటనే సరైన వైద్య సదుపాయం అందాలని కోరారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ బాధిత కుటుంబాలకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు.