డాక్టర్ తప్పిదం లేదు_ _క్షమాపణ కోరిన బాలిక తల్లిదండ్రులు_
అపార్ధం చేసుకున్నాం…
- డాక్టర్ తప్పిదం లేదు
- క్షమాపణ కోరిన బాలిక తల్లిదండ్రులు
ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ మైనర్ బాలిక పట్ల అనుచిత ప్రవర్తన చేశారంటూ డాక్టర్ పై దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులు వైద్యశాల సిబ్బందితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం అపార్థం జరిగిపోవడం వలన ఆ గందరగోళానికి ఆస్కారం కలిగిందని డాక్టర్ ఎలాంటి తప్పు లేదని క్షమాపణ కోరారు. చిన్న పిల్ల కావటం వల్ల పరీక్షించేటప్పుడు డాక్టర్ చేతులు తగలటం వల్ల అది బ్యాడ్ టచ్ అని భావించి తల్లిదండ్రులకు చెప్పిందని ఆవేశంలో డాక్టర్ పై విరుచుకుపడ్డామని వాస్తవాలు తెలుసుకుంటే అలాంటిదేమీ జరగలేదని వారు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోతే పరిస్థితి ఏమిటీ అంటూ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ఎప్పుడు రోగి క్షేమం కోసమే ఆలోచిస్తారు కానీ మరో రకమైన ఆలోచన ఉండదని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ శివరాం, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ రియాజ్, బాలిక తండ్రి వైద్యశాల సిబ్బంది ఉన్నారు.