చంద్రబాబు మోసాల్ని అసహించుకుంటున్న ప్రజలు
వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున
ప్రజల్ని దగా చేస్తోన్న కూటమి…
- చంద్రబాబు మోసాల్ని అసహించుకుంటున్న ప్రజలు
- వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున
చంద్రబాబు చేస్తున్న మోసాలను.. ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున విమర్శించారు. అనేక వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు అదే ప్రభుత్వం చేతుల్లో ప్రజలు దగాకు గురయ్యారన్నారు. యువతకి ఇస్తామన్న 3 వేల రూపాయల నిరుద్యోగ భృతికి కూడా ఈ ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. నెల్లూరులోని సిటీ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.