నెలవల సుబ్రహ్మణ్యం – నాయుడుపేట టిడిపి కార్యాలయంలో సంబరాలు
రాష్ట్రంలో డబుల్ ఇంజన్ పాలన
నెలవల సుబ్రహ్మణ్యం
నాయుడుపేట టిడిపి కార్యాలయంలో సంబరాలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని
టిడిపి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. డబల్ ఇంజిన్ సర్కార్ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని టిడిపి సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నరేంద్ర మోడీ సహకారంతో రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని కొనియాడారు. సీఎం చంద్రబాబు పరిపాలన దక్షతతో అప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని నెలవల తెలిపారు. ఈకార్యక్రమంలో ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.