ఇంటింటికీ సోమిరెడ్డి కుటుంబం – ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతిరెడ్డి
ప్రతి సమస్యను పరిష్కరించేలా కృషి
ఇంటింటికీ సోమిరెడ్డి కుటుంబం
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతిరెడ్డి
ఇంటింటికీ సోమిరెడ్డి కుటుంబం లో భాగంగా.. సర్వేపల్లి ఎమ్మెల్యే కొడుకు, కోడలు రాజగోపాల్‌రెడ్డి, శృతిరెడ్డిలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. పొదలకూరు మండలం అమ్మవారిపాళెంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలపై సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డిలు ఆరా తీశారు. ప్రజలు, కార్యకర్తలతో నేరుగా కలుస్తూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు.. అమలులోకి రానున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాలపై ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి లు హామీ ఇస్తున్నారు.