ఆ కుటుంబంలో అందరూ ప్రజల కోసం స్వార్థం లేకుండా పనిచేసేవారే
మూడు తరాల వారితో పనిచేసే అదృష్టం నాకు లభించింది
ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్లో సోమిరెడ్డి
జనం గుండెల్లో దేవుడు ఎన్టీఆర్..!
ఆ కుటుంబంలో అందరూ ప్రజల కోసం స్వార్థం లేకుండా పనిచేసేవారే
మూడు తరాల వారితో పనిచేసే అదృష్టం నాకు లభించింది
ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్లో సోమిరెడ్డి
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయన ఆ వేదికపై మాట్లాడారు. నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలు ఆయనకు వచ్చాయని.. రాముడు, కృష్ణుడు, అర్జునుడు అంటే ఎన్టీఆరే గుర్తుకొస్తారు..జనం గుండెల్లో ఆయన దేవుడిగా నిలిచారని పేర్కొన్నారు. కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజకీయాన్ని అన్ని వర్గాలకు పరిచయం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేసిన నాయకుడాయనని.. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐకాన్ గా నిలుస్తోందన్నారు. వైసీపీ అరాచకాలతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడే పరిస్థితుల్లో లోకేష్ బాబు యువగళం పాదయాత్రతో చైతన్యం నింపారని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి హోదాల్లో అటు రాజకీయంగా, ఇటు ప్రజాపాలనలో లోకేష్ బాబు సత్తా చూపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, లోకేష్ ఈ మూడు తరాలవారితో పనిచేసే అదృష్టం తనకు లభించిందన్నారు. నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులందరూ ప్రజాసేవలో తరిస్తున్నారని.. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేసే కుటుంబం.. నందమూరి కుటుంబం అని ఈసందర్భంగా సోమిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, టీడీ జనార్దన్, సినీ నటుడు నారా రోహిత్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.