నాడు అవినీతి చేసిన నాయకులు.. నా దగ్గర క్రమశిక్షణతో ఉన్నారు
తమ్మళ్లందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించిన ఎమ్మెల్యే
నాడు అవినీతి చేసిన నాయకులు.. నా దగ్గర క్రమశిక్షణతో ఉన్నారు
తమ్మళ్లందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించిన ఎమ్మెల్యే
నాయకులుగా చెప్పుకుని వ్యక్తులు సొంత గ్రామాలలో ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఏం చేస్తున్నారంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆ పార్టీ నాయకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు… పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని పెనుబల్లి గ్రామంలో ఆమె పాల్గొని సీసీ రోడ్లను ప్రారంభించారు.. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి పలువురు ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకొచ్చారు…నేను వచ్చినప్పుడు సమస్యలు రావడం ఏమిటి.. మీరేం చేస్తున్నారు…నాతో ఉండే నాయకులు ఫస్ట్ ప్రజలకు సేవ చేయాలనీ పార్టీ నేతలకు సూచించారు…కోవూరు నియోజవర్గంలో 28 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్ల పెంపుతో పాటు అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. గ్రామస్థాయిలో నాయకులు స్థానిక ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనీ చెప్పారు.. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సుపరిపాలకు సంకేతంగా స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు..