చెరువుని తలపిస్తోన్న ఇళ్ల స్లాబ్లు_ _అడవులను తలపిస్తోన్న వీధులు
తండాలోని డబుబ్ బెడ్ రూమ్ కాలనీల పరిస్థితి
సమస్యలకు కేరాఫ్ ముత్యాలమ్మ కాలనీ…
- చెరువుని తలపిస్తోన్న ఇళ్ల స్లాబ్లు
- అడవులను తలపిస్తోన్న వీధులు
- తండాలోని డబుబ్ బెడ్ రూమ్ కాలనీల పరిస్థితి
చెరువులను తలపించే ఇంటి స్లాబ్లు, అడవులను తలపించే కాలనీ వీధుల్లో నానా ఇబ్బందులు పడుతున్నామని ముత్యాలమ్మ కాలనీ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామ పంచాయతీ ముత్యాలమ్మ కాలనీ తండా సమస్యలకు కేరాఫ్ గా మారింది. ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ప్రభుత్వం అందచేసిన ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారు తమ సమస్యలను ఏకరువు పెడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షాలు వచ్చినా వర్షపు నీరు ఇంటి స్లాబుపై చెరువుని తలపించేలా నిలిచిపోతుందుని వాపోతున్నారు. కాలనీలోని వీధులు పిచ్చిచెట్లతో, పచ్చిగడ్డితో అడవులను తలపిస్తున్నాయని, పారిశుధ్య సిబ్బంది కానీ, పంచాయతీ పాలకులు కానీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. పారిశుధ్య లోపం కారణంగా అంటు వ్యాధులు సైతం ప్రభలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం వస్తే కనీసం తిరిగే దానికి రహదారి కూడా లేకుండా పోతుందని… వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి… రాబోయే వర్షాకాలాన్ని ద్రుష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.