కంప్యూటర్లు దోచుకెళ్లారు..!
ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కంప్యూటర్ల చోరీ
వెంటిలేటర్ కిటికీలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు
రాత్రైతే.. మద్యం, మత్తు, ఆకతాయి పనులకు కేంద్రంగా ఆ ప్రాంతం_
దొంగలు పడ్డారు..
కంప్యూటర్లు దోచుకెళ్లారు..!
ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో
కంప్యూటర్ల చోరీ
వెంటిలేటర్ కిటికీలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు
రాత్రైతే.. మద్యం, మత్తు, ఆకతాయి పనులకు కేంద్రంగా ఆ ప్రాంతం
బాగా గమనించారు.. రెక్కీ చేశారు.. మాంచి స్కెచ్ వేశారు.. ఎవరూ లేని సమయంలో.. అర్థరాత్రి దాటాక.. ఆ ప్రభుత్వ కార్యాలయంలో దొంగలు పడ్డారు.. విలువైన కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. ఉదయంకల్లా .. ఈ విషయం బయటకు పొక్కింది.. చేసేదిలేక.. సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంఘటన ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. ఉదయగిరిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చోరీ జరిగింది. పలు గదుల్లోని కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు. ఆ కార్యాలయంలోని మూడు గదులలోని వెంటిలేటర్ల కిటికీలను పగలగొట్టి మరీ.. కంప్యూటర్లను చోరీ చేశారు. ఆ ప్రాంతంలో సాయంత్రం ఆరు.. ఏడు గంటలు దాటిందంటే.. జన సంచారం ఉండదు. మందుబాబులు, మత్తు పదార్థాలు సేవించేవారు.. ఆకతాయిలు అక్కడ చేరి.. అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతుంటారు. ఒంటరిగా అటువైపు వెళ్లాలంటే కూడా భయపడతారు. పోలీసులుగాని.. అధికారులుగాని అస్సలు పట్టించుకోరు. దాంతో వారు రెచ్చి పోతున్నారు. ఈ ఆకతాయిలుగాని.. బాగా తెలిసిన వారుగాని.. జల్సాలకు అలవాటు పడ్డ యువకులెవరైనా బాగా గమనించి.. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. బుధవారం ఉదయం విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది గమనించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొందరిపై సందేహం ఉండడంతో.. వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.