పద్మశాలి సంఘం సౌజన్యంతో అందచేత
ఎంపీతో కలసి ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
పది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
- పద్మశాలి సంఘం సౌజన్యంతో అందచేత
- ఎంపీతో కలసి ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందచేశారు. 500కి పైగా మార్కులు సాధించిన 120 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు.
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు మైపాడు గేటు రోడ్డులోని డీజీపీ కళ్యాణ మండపంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సౌజన్యంతో పదో తరగతిలో 500కి పైగా మార్కులు సాధించిన మొత్తం 120 మంది విద్యార్థులకు పురస్కారాలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు తదితరులతో కలసి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందచేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బాలాజీ, పద్మశాలి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.