స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పథకాలు
నెల్లూరు కలెక్టరేట్లో మెప్మా, డీఆర్డీఏ సిబ్బందికి శిక్షణ_
ఫుడ్ ప్రాసెసింగ్ లో అపార అవకాశాలు
- స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పథకాలు
- నెల్లూరు కలెక్టరేట్లో మెప్మా, డీఆర్డీఏ సిబ్బందికి శిక్షణ
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వ్యాపార నైపుణ్యాలు, ఫుడ్ హ్యాడ్లింగ్ తదితర అంశాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నెల్లూరు కలెక్టరేట్లో నిర్వహించారు. వ్యాపార నైపుణ్యాలు, ఫుడ్ హ్యాండ్లింగ్ లోన్ ఫెసిలిటీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఆహార శుద్ధి పరిశ్రమలో ఉన్నటువంటి అపార అవకాశాలను వినియోగించుకొని గ్రామీణ యువత ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి శ్రీనివాసులు అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డి ఆర్ డి ఏ , మెప్మా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆహార శుద్ధి కార్యకలాపాలపై సాంకేతిక శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ… రెడీ టు ఈట్, రెడీ టు కుక్ విధానంలో ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా, ఆహార శుద్ధి రంగంలో ఉన్నటువంటి అపార అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ఇందుకోసం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను ఫార్మలైజ్ చేయడం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం మౌలిక సదుపాయాలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్, నైపుణ్యాభివృద్ధి అందించడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా, డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.