_ఐదుగురికి గాయాలు… కావలి ఏరియా వైద్యశాలకు తరలింపు
బోగోలు మండలం కడనూతలలో ఘటన
ఘర్షణ పడ్డవారు టీడీపీ, వైసీపీ మద్దతుదారులు కావడంతో ఉద్రిక్తత
చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య, వైసిపి నాయకులు
స్థల వివాదం పరస్పర దాడులు…
- ఐదుగురికి గాయాలు… కావలి ఏరియా వైద్యశాలకు తరలింపు
- బోగోలు మండలం కడనూతలలో ఘటన
- ఘర్షణ పడ్డవారు టీడీపీ, వైసీపీ మద్దతుదారులు కావడంతో ఉద్రిక్తత
- చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే కావ్య, వైసిపి నాయకులు
ఓ స్థలం వివాదంలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీ, టీడీపీ మద్దతుదారులకి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతలలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ స్థల వివాదంపై ఘర్షణకు దిగి పరస్పరం దాడులకు చేసుకున్నారు. దీంతో గాయాలుపాలవగా వీరిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇరువురు టీడీపీ, వైసిపి మద్దతుదారులు కావడంతో పరిస్థితి మరింత తీవ్రం దాల్చింది. దాడుల్లో వైసిపి మద్దతుదారులు నాటకరాణి బాబు, మన్నేపల్లి రజనీలకు గాయాలు అయ్యాయి. అదేవిధంగా టీడీపీ మద్దతుదారులు నాటకరాణి సురేంద్ర, నాటకరాణి సునీత అనేవారికి గాయాలు అయ్యాయి. టిడిపి మద్దతుదారులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరామర్శించారు. అదేవిదంగా వైసిపి మద్దతుదారులను వైసిపి నాయకులు పరామర్శించారు.