వైద్యం కోసం వచ్చిన బాలిక పట్ల వైద్యాధికారి అసభ్యకర్త ప్రవర్తన
ఉదయగిరి సీహెచ్సీలో దారుణం_
ఛీ…ఇదేం పని డాక్టర్
- వైద్యం కోసం వచ్చిన బాలిక పట్ల వైద్యాధికారి అసభ్యకర్త ప్రవర్తన
- ఉదయగిరి సీహెచ్సీలో దారుణం
నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సామాజిక కేంద్రానికి వైద్యం కోసం వచ్చిన మైనర్ బాలిక పట్ల వైద్యాధికారి ప్రశాంత్ అసభ్యకర ప్రవర్తనకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కోపద్రక్తులైన ,వైద్యునిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి… డాక్టర్ పై దాడికి ప్రయత్నించిన బాలిక తల్లిదండ్రులకు సర్ది చెప్పడంతో గొడవ సర్దు మనిగింది. విచారణ నిమిత్తం వైద్యుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎన్ 3 న్యూస్ డెస్క్ రిపోర్ట్ …..