పాఠశాలలను విలీనం చేయద్దు
తిరుపతి కలెక్టర్ కి వినతి పత్రం అందచేసిన మల్లెమాల గ్రామస్థులు
మా బడి మాకు కావాలి…
- పాఠశాలలను విలీనం చేయద్దు
- తిరుపతి కలెక్టర్ కి వినతి పత్రం అందచేసిన మల్లెమాల గ్రామస్థులు
3,4,5 తరగతులను విలీనం చేయవద్దని…దీని కారణంగా తమ బిడ్డలు తీవ్ర ఇబ్బందులు పడుతారని తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం మల్లెమాల గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని గ్రీవెన్స్ లో కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సుబ్రహ్మణ్యం, నరసింహనాయుడు , శివకుమార్, బాలకృష్ణ నాయుడు ఎన్ 3 న్యూస్ తో మాట్లాడారు. పాఠశాలలను విలీనం చేయవద్దని ‘మా బడి మాకు కావాలి’ అని అన్నారు. సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటంబేడు పాఠశాలలో విలీనం చేయవద్దని కోరారు. రోజు వారి కూలీ పనులు చేసుకునే తాము ఉదయాన్నే వెళ్లాలని, పిల్లలను దూరంగా ఉండే మరో పాఠశాలలకు పంపాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత దూరం పోవాలంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పాఠశాలను యథావిథిగా కొనసాగించకుంటే తమ పిల్లలను ఇంటి దగ్గరే ఉంచుకుంటామన్నారు.