సమస్యను పరిష్కరించే వరకు పనులు జరగనివ్వం
రైల్వే ట్రాక్ పనులను అడ్డుకున్న స్థానికులు
గాంధీనగర్ మునిగిపోతే…దిక్కెవరు..?
- సమస్యను పరిష్కరించే వరకు పనులు జరగనివ్వం
- రైల్వే ట్రాక్ పనులను అడ్డుకున్న స్థానికులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గాంధీనగర్ బిటిపిఎస్ కు నిర్మించే రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా వర్షా కాలంలో తమ ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైల్వే ట్రాక్ పనులను మహిళలు అడ్డుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ….రైల్వే ట్రాక్ పనుల వల్ల తమ గాంధీ నగర్ మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసినా…అధికారులు, నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్ధం కావడం లేదని వాపోయారు. వెంటనే ప్రభుత్వం ప్రభుత్వం, అధికారులు స్పందించి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పనులను జరగనీయమని హెచ్చరించారు.