గుంటూరు CID పోలీసుల అదుపులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి – సోమిరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై కాకానిపై కేసు నమోదు – ఈ కేసులో గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ – కాకానిని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు – ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న గోవర్థన్‌రెడ్డి – కాకాణిపై గత శనివారం రాత్రి మరో రెండు కేసులు నమోదు
వరుస కేసులతో కాకాణి ఉక్కిరిబిక్కిరి..!
- గుంటూరు CID పోలీసుల అదుపులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
- సోమిరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై కాకానిపై కేసు నమోదు
- ఈ కేసులో గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్
- కాకానిని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
- ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న గోవర్థన్‌రెడ్డి
కాకాణిపై గత శనివారం రాత్రి మరో రెండు కేసులు నమోదు
వైసీపీ జిల్లా అధ్యక్షుడు.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా.. అట్రాసిటీ కేసులు ఎదుర్కొంటున్న కాకాణి.. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ శిక్ష అనుభవవిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుల్లో పురోగతి కోసం మూడు రోజుల పాటు పోలీసు కష్టడీ ఆదివారంతో ముగిసింది. మళ్లీ వెంటనే ఆయన్ను గుంటూరు సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా.. అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ చిత్రాలు పెట్టడంతో గతంలోనే సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసి ఉన్నారు. తాజాగా ఆ కేసుకు సంబంధించి విచారించేందుకు గుంటూరులోని న్యాయస్థానంలో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు.. కాకాణిని కొద్ది సేపటి క్రితం నెల్లూరు జైలు నుంచి అదుపులోకి తీసుకుని.. గుంటూరు కోర్టులో హాజరుపర్చేందుకు తరలించారు. ఇప్పటికే అక్రమ మైనింగ్, అట్రాసిటీ కేసులతోపాటు గత శనివారం రాత్రి మరో రెండు కొత్త కేసులు కూడా నమోదు చేశారు. వీటితోపాటు ఈ పాత కేసును కూడా వెలుగులోకి తేవడంతో చర్చనీయంశంగా మారింది. 2014 ఎన్నికల్లో నమోదైన కేసులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన కల్తీ మద్యం వ్యవహారాన్ని తిరగదోడే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాకాణికి పలు కేసుల ఉచ్చైతే బిగుసుకుంటోందని.. ఒకటి తర్వాత మరొక కేసు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం అంటున్నారంతా…!