రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే సీఎం లక్ష్యం

ఎంపీ వేమిరెడ్డి_ _స్వర్ణాంధ్ర విజన్‌ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు_

రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే సీఎం లక్ష్యం…

  • ఎంపీ వేమిరెడ్డి
  • స్వర్ణాంధ్ర విజన్‌ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ప్రపంచంలోనే ఎక్కడా లేని మోడల్‌ పి-4 అని, ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి బాటలు వేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్‌ కార్యాలయాలను సోమవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీసీ హాల్ నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కె కార్తీక్‌, డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావు, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ రఘురామయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేస్తున్న స్వర్ణాంధ్ర`2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… 10సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలుచేసి పేదరికాన్ని పారదోలడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *