రాష్ట్రంలో ఎమర్జెన్సీరాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు
రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు
- మీడియా మీద కక్షసాధింపులు
- కొమ్మినేని అరెస్ట్ పత్రికాస్వేచ్చపై దాడి
- వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం
కూటమి పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితిలు కనిపిస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియాపై సీఎం చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిటీవీ డిబేట్‌లో పాల్గొన్న జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఒక ప్రణాళిక ప్రకారం వివాదంగా మార్చి, సంబంధం లేని సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం చూస్తుంటే పత్రికా స్వేచ్చను ఈ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెడుతున్నారనే విషయం అర్థమవుతోందని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేన్నారంటే…