జనసేన పార్టీ ఆధ్వర్యంలో అశోక్ పుట్టిన రోజు వేడుకలు
మజ్జిగ చలివేంద్రం, పేదలకు అన్నదానం చేసిన నాయకులు
నాయకుల పుట్టిన రోజులు…పేదలకు ప్రయోజనం కావాలి
- జనసేన పార్టీ ఆధ్వర్యంలో అశోక్ పుట్టిన రోజు వేడుకలు
- మజ్జిగ చలివేంద్రం, పేదలకు అన్నదానం చేసిన నాయకులు
రాజకీయ నాయకుల పుట్టిన రోజు వేడుకలు పేదల ఆకలి తీర్చేందుకు ఉపయోగపడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుతో పేదలకు అన్నదానం చేయడం జరిగిందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల జనసేన నాయకులు బోలా అశోక్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముత్తుకూరులో మంచినీటి, మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన నాయకులు జంగాల కండ్రిగ గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పేదలకు భోజన వసతి కల్పించారు. అనంతరం పరిసరాల పరిరక్షణ కోసం గిరిజన కాలనీలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రహీమ్, శ్రీహరి, సుమన్, చిన్న, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.