ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు
విద్యార్థుల్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపిన యాజమాన్యం
రాష్ట్ర స్థాయిలో మళ్లీ మెరిసిన నారాయణ…
- ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు
- విద్యార్థుల్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపిన యాజమాన్యం
ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో 1,2,5,7 ర్యాంకులు సాధించి నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఫలితాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
నిన్న విడుదలైన ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో 1,2,5,7 ర్యాంకులు కైవసం చేసుకొన్నారు. నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కాలేజ్ లో విజయోత్సవ సంబరాలు జరిపారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థుల్ని అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల డీన్ జయకుమార్ రాయుడు మీడియాతో మాట్లాడుతూ..నారాయణ విద్యా సంస్థల్లో మైక్రో షెడ్యూల్, ప్రణాళికా బద్ధమైన బోధన, పద్దతులు, పేపర్ డిస్కషన్ వంటి పద్దతుల ద్వారా విద్యా బోధన అందించడం జరుగుతుందని చెప్పారు. నారాయణ విద్యా సంస్థల అధ్యాపక బ్రందం, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల క్రుషి వల్ల ప్రతి విభాగంలో కూడా నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగుర వేస్తున్నారని రాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు డీన్లు, కోర్ డీన్లు, డీజీఎం, ఏజీఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.