ఏపీ విద్యా విధానం A+

విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు

కస్తూరిదేవి గార్డెన్స్ వేదికగా షైనింగ్ స్టార్స్

హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్, నగర మేయర్

ఏపీ విద్యా విధానం A+…

  • విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు
  • కస్తూరిదేవి గార్డెన్స్ వేదికగా షైనింగ్ స్టార్స్
  • హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్, నగర మేయర్


పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందచేశారు. షైనింగ్ స్టార్స్ అనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకి ప్రశంసా పత్రాలు, నగదు, పురస్కారం ప్రదానం చేశారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ వేదికగా ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది.


రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగం ఏ ప్లస్ గ్రేడ్ కి చేరుకుతుందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్స్ లో…విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ – ప్రతిభా పురస్కారాల వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీ వేమిరెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్ తో కలసి పలువురు ఎమ్మెల్యేలు, మేయర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా పదో తరగతిలో అత్యుత్తమ మార్కుల సాధించిన 250 మంది, ఇంటర్మీడియట్ లో 34 మంది మొత్తం 284 మంది విద్యార్థులకు పురస్కారాలు అందచేశారు. ఒక్కొ విద్యార్థికి రూ. 20వేలు నగదు పురస్కారం, మెడల్, సర్టిఫికెట్లను వారు ప్రదానం చేసి కొనియాడారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, మేయర్ స్రవంతి, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కృష్ణారెడ్డిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీఈవో, పలువురు విద్యాశాఖాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *