ఉపాధి హామీ ప్రాధమిక విచారణలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం
పోలీసులు జోక్యంతో వివాదం సర్ధుబాటు_
నర్రవాడలో ఉద్రిక్తత…
- ఉపాధి హామీ ప్రాధమిక విచారణలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం
- పోలీసులు జోక్యంతో వివాదం సర్ధుబాటు
నర్రవాడ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై అధికారులు ప్రాధమిక విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందనీ గ్రామస్తులు కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన విధితమే. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విజిలెస్ అధికారి విజయలక్ష్మి , APD మృధుల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రాధమిక విచారణ చేపట్టారు. విచారణ జరుగుతున్న సమయంలోనే అధికారుల ఎదుటే ఒకరిపై ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని…ఇరువురికి సర్ధి చెప్పి పంపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో విచారణకు వచ్చామన్నారు. ఉపాధిహామిలో చాలా వరకు అవినీతి జరిగినట్లు గుర్తించామని తెలియజేశారు. పని చేసిన వారికీ ఒక వేతనం, పని చేయకుండా ఉండేవారికి ఒక వేతనం ఇస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అలా చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.