ఆదివాసి నాయకులతో కలసి పోరాటం
అశ్వరరావుపేట తహసీల్దార్, అటవీ కార్యాలయాల ఎదుట ప్రజలు నిరాహార దీక్ష
అధికారులు స్పందించకుంటే…
- ఆదివాసి నాయకులతో కలసి పోరాటం
- అశ్వరరావుపేట తహసీల్దార్, అటవీ కార్యాలయాల ఎదుట ప్రజలు నిరాహార దీక్ష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలోని తాసిల్దార్, అటవీ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రామన్నగూడెం ప్రజలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామన్నగూడెం గ్రామంలోని పెండింగ్ లో ఉన్న సర్వే నెంబరు 30,36,39 భూములను స్థానికంగా ఉన్న ఆదివాసీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికారులకి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు ఎన్3 న్యూస్ తో మాట్లాడారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ఆదివాసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరూ స్పందించకుంటే అన్నీ సంఘాల ఆదివాసీ నాయకులతో కలసి పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.