కావలిలో వైసీపీ నేత జనిగర్ల మహేంద్ర యాదవ్ టిడిపిలో చేరిక
టీడీపీలోకి ఆహ్వానించిన కావ్య కృష్ణారెడ్డి
నిరంతరం పనిచేసే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిదే ఇక ఎప్పుడు గెలుపేనన్న జనిగర్ల మహేంద్ర యాదవ్
కావ్య కృష్ణారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి…
- కావలిలో వైసీపీ నేత జనిగర్ల మహేంద్ర యాదవ్ టిడిపిలో చేరిక
- టీడీపీలోకి ఆహ్వానించిన కావ్య కృష్ణారెడ్డి
- నిరంతరం పనిచేసే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిదే ఇక ఎప్పుడు గెలుపేనన్న జనిగర్ల మహేంద్ర యాదవ్
కావలిలోని మన్నెం గోపాల కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ భారీగా తన అనుచరులు, పలువురు వైసీపీ నాయకులతో టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువా వేసి టిడిపిలోకి ఆహ్వానించారు.
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వమే వర్ధిల్లాలి అంటూ కావలిలో వైసీపీ కిలక నేత జనిగర్ల మహేంద్ర యాదవ్ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం కావలిలోని మన్నెం గోపాల కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ భారీగా తన అనుచరులు, పలువురు వైసీపీ నాయకులతో టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువా వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను,మహేంద్ర యాదవ్ ను వారి అభిమానులు గ్రామాలతో సత్కరించారు. మహేంద్ర యాదవ్ మాట్లాడుతూ బాగా పనిచేసే ఎమ్మెల్యేలను అరుదుగా చెప్పుకుంటామని, వారిలో ఒకరు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆయన నిరంతరం పనిచేస్తున్నారని ఎప్పుడూ ఆయనదే గెలుపు అంటూ తెలిపారు. ఇకనుంచి కావ్య కృష్ణారెడ్డి నాయకత్వమే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.