విద్యార్థుకి సూచించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్
పదిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన ఎస్పీ
ఉచిత అడ్మిషన్స్ కాదు…కష్టపడి చదవాలి
- విద్యార్థుకి సూచించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్
- పదిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన ఎస్పీ
పదో తరగతి మంచి మార్కులు సాధించిన పోలీసు పిల్లలు, తల్లిదండ్రుల్ని ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి కోరుకున్న కార్పోరేట్ కళాశాలలలో ఉచిత అడ్మిషన్స్ అందించారు.
విలువలతో కూడిన విద్య పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది జిల్లా యస్.పి. కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి కోరుకున్న కార్పోరేట్ కళాశాలలలో ఉచిత అడ్మిషన్స్ అందించారు. పోలీసు పిల్లలు క్రమశిక్షణతో, జీవిత లక్ష్యం ఆధారంగా కష్టపడి చదివి ఉన్నతస్థాయికి వెళ్లాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. మంచి మార్కులు పొందిన పోలీసు పిల్లలు, తల్లిదండ్రులను ఆయన అభినందించారు. పోలీస్ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే.. మన అందరికీ చాలా గౌరవం.. మొదట సంతోషపడేది తల్లిదండ్రులేనన్నారు. ఉచిత అడ్మిషన్స్ అందించిన యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి.(అడ్మిన్) CH.సౌజన్య , AO చంద్రమౌళి, SB CI-1 వెంకటేశ్వరరావు, వెల్ఫేర్ RI రాజా రావు, RI అడ్మిన్ అంకమరావు, జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ మద్దిపాటి ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.