దొరికిన డబ్బుని పోలీసులకి అప్పగింత

నిజాయితీ చాటుకున్న రాయదుర్గం సురేష్

సురేష్ ని అభినందించి వెయ్యి నగదు రివార్డ్ అందచేసిన పొదలకూరు సీఐ

దొరికిన డబ్బుని పోలీసులకి అప్పగింత

  • నిజాయితీ చాటుకున్న రాయదుర్గం సురేష్
  • సురేష్ ని అభినందించి వెయ్యి నగదు రివార్డ్ అందచేసిన పొదలకూరు సీఐ

చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైత రామకృష్ణారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం బుధవారం పొదలకూరు SBI బ్యాంకులో బంగారు నగలు కుదువపెట్టగా వచ్చిన రూ. 86వేలు నగదు మోటార్ బైక్ పెట్రోల్ ట్యాంక్ కవర్ లో పెట్టుకొని తీసుకెళుతూ మధ్యలో భోజనం కోసం బైక్ నిలిపాడు. రామకృష్ణారెడ్డి బ్యాంక్ లో నగదు తీసుకొని మోటార్ బైక్ లో వెళుతున్న విషయాన్ని పసిగట్టిన దుండగుడు బైక్ ను ఫాలో అయ్యాడు. భోజనం కోసం మార్గమధ్యలో నిలిచిన సమయంలో బైక్ కవర్లోని నగదు అపంహరించుకెళ్లిన విషయం పాఠకులకు విధితమే. అయితే అదేరోజు అనుమానితునిగా ముంబాయికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో భాగంగా CC tv విజువల్స్ పరిశీలించిన పోలీసులు ముంబాయికి చెందిన వ్యక్తి కాదని నిర్ధారించుకొని అతనిని వదిలి పెట్టారు. అయితే cc tv విజువల్స్ పరిశీలించిన పోలీసులు బైక్ లోని డబ్బులు తస్కరించిన దుండగుడు శ్రీనివాసపురం వీధిలో వెళ్లినట్లు గుర్తించి ఆ కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈరోజు శుక్రవారం ఉదయం శ్రీనివాసపురం వీధిలో చెత్త సేకరణ బండి వచ్చి ఆగింది. సమీపంలో నివాసం ఉంటున్న రాయదుర్గం సురేష్ చెత్తను బండిలో వేసేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో చెత్త కుప్పలోని కవర్లో నగదు ఉండటానికి గమనించాడు. ఆ కవర్లో నగదుతోపాటు బ్యాంక్ పాస్ పుస్తకం ఉండటంతో గుర్తించి నగదు పొదలకూరు ఎస్ ఐ షేక్ మహ్మద్ హనీఫ్ కు అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు. దొరికిన డబ్బు పోలీసులకు అందజేసిన సురేష్ నిజాయితీని ఈ సందర్బంగా ఎస్ ఐ హనీఫ్ అభినందిస్తూ వెయ్యి రూపాయలు నగదు రివార్డును అందజేశారు. ఈ నగదు తోపాటు దొరికిన బ్యాంక్ పాస్ పుస్తకం, పాన్ కార్డులోని ఆధారాల కారణంగా ఈ నగదు చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డిగా పోలీసులు గుర్తించారు. కాగా cc tv విజువల్స్ ఆధారంగా పోలీసులు విచారణ ముమ్మరం చేసిన నేపథ్యంలో ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో దుండగుడు ఆ డబ్బును చెత్తకుప్పలో పడేసి ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. అనంతరం సీఐ మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *