పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కోట,వాకాడు ఆర్టీసీ బస్టాండ్లను పరిశీలించిన ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి
వాకాడు బస్టాండ్‌కు మరమ్మతులు చేయాలి…
- పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- కోట,వాకాడు ఆర్టీసీ బస్టాండ్లను పరిశీలించిన ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి
ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట, వాకాడు మండల కేంద్రాలలోని ఆర్టీసీ బస్ స్టేషన్లను ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ డిపో అధికారులు, స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు అందిస్తోన్న సేవలను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించాలని సురేష్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ… అధ్వానంగా ఉన్న వాకాడు బస్ స్టేషన్ కు మరమ్మత్తులు చేయాలని, అలాగే కోట బస్టాండ్ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డిపో మేనేజర్ పెంచలయ్య, బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, జిల్లా కోర్ కమిటీ సభ్యులు గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పామంజి కృష్ణయ్య, డాక్టర్ సారంగ రమేష్ బాబు, దువ్వూరు శరత్ చంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు.