నిద్రమత్తు రెప్పపాటులో ప్రమాదం
మంటల్లో చిక్కుకున్న కారులో నుంచి డ్రైవర్ ను కాపాడిన ఆ మార్గంలో వెళ్ళే ప్రయాణికులు
కారు అలా దగ్ధం…
- నిద్రమత్తు రెప్పపాటులో ప్రమాదం
- మంటల్లో చిక్కుకున్న కారులో నుంచి డ్రైవర్ ను కాపాడిన ఆ మార్గంలో వెళ్ళే ప్రయాణికులు
నెల్లూరు జిల్లా కావలి – ఉదయగిరి రోడ్డులో కారు బోల్తాకొట్టి దగ్ధం అయ్యింది. ఈ ఘటన కలిగిరి మండలం పెద్దపాడు వద్ద సోమవారం జరిగింది. వరికుంటపాడు మండలం గువ్వాడికి చెందిన శివ అనే వ్యక్తి కావలి నుంచి కారులో తానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు. పెద్దపాడు సమీపానికి వచ్చాక నిద్రమత్తులో కారు పక్కకు వెళ్ళింది. తేరుకుని కారును రోడ్డుపైకి తిప్పే క్రమంలో పల్టీలు కొట్టింది. దీంతో మంటలు చెలరేగి కారు దగ్ధం అయ్యింది. ఈ మార్గంలో వెళుతున్న వారు గమనించి హుటాహుటీన కారులో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీయడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.