క్వాడ్జ్ అక్రమంలో పీహెచ్డీ చేసిన కాకాణి
ప్రసన్నపై సోమిరెడ్డి అనుచరులు ఫైర్
- క్వాడ్జ్ అక్రమంలో పీహెచ్డీ చేసిన కాకాణి
మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి అనుచరులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోసారి సోమిరెడ్డిని విమర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.
నెల్లూరు వేదాయపాళెంలోని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన అనుచరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రశాంతమ్మ దెబ్బకు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నియోజకవర్గం వదలి పారిపోయాడని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ అంటే తప్పు చేసినోళ్లు మాత్రమే భయపడుతారని ప్రసన్నకి చురకలంటించారు. ప్రసన్న సొంత మేనత్త, సోమిరెడ్డి తల్లిని కాకాణిని విమర్శించన రోజు ప్రసన్న ఎక్కడికి వెళ్ళాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ప్రసన్న మరోసారి సోమిరెడ్డి జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.