సూళ్లూరుపేటలో డంపింగ్ యార్డ్ లో రగులుతున్న మంటలు
భయబ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు
అవస్థలు పడుతున్న వాహనదారులు
- సూళ్లూరుపేటలో డంపింగ్ యార్డ్ లో రగులుతున్న మంటలు
- భయబ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు
- అవస్థలు పడుతున్న వాహనదారులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డ్ లో మళ్ళీ మంటలు చెలరేగాయి. డంపింగ్ యార్డ్ లో చెత్తాచెదారం అధికంగా పేరుకుపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల దాటికి విపరీతమైన పొగ అలుముకుంది. డంపింగ్ యార్డ్ పక్కనే జాతీయ రహదారి ఉండడంతో పొగ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. డంపింగ్ యార్డ్ సమీప ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తరచూ డంపింగ్ యార్డ్ లో మంటలు వ్యాపిస్తుండడంతో స్థానిక ప్రజలు వాహనదారులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ లోని విషపూరిత పొగ వల్ల ఆరోగ్యపర సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. రహదారిపై దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ఇక్కడికి వచ్చేసరికి వాహనదారులు భయం భయంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇకనైనా సంబంధిత శాఖ అధికారుల స్పందించి డంపింగ్ యార్డ్ ను సూళ్లూరుపేట పట్టణానికి దూరంగా ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.