-ప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని కలసిన మాజీ మంత్రి హరీష్రావు
ఆర్థిక సాయం అందజేత
అధైర్యపడకండీ.. అండగా ఉంటాం
ప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని కలసిన మాజీ మంత్రి హరీష్రావు
ఆర్థిక సాయం అందజేత
మాజీ మంత్రి, సిద్ధిపేట జిల్లా ఎమ్ఎల్ఏ తన్నీరు హరీష్ రావు ఆదివారం వర్గల్ మండలం తునికిమక్తకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. వరంగల్ సభకు వెళ్లి వస్తూ.. ఆక్సిడెంట్ లో చనిపోయిన చాకలి కనకయ్య కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సహాయం అందచేశారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడొద్దంటూ.. ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.