ప్రతీ ఒక్కరూ యోగాంధ్రాలో పాల్గొనాలి

లువాయి మండల ఇన్చార్జి ఎంపీడీవో భవాని

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన యోగాంధ్రాలో ప్రతీ ఒక్కరూ పాల్గొని ఆరోగ్యగంగా ఉండాలని ఎంపీడీవో భవాని పిలుపునిచ్చారు. కలువాయి ఎంపీడీవో కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.


నెల్లూరు జిల్లా కలువాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంచార్జ్ ఎంపీడీవో భవాని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు జరుగుతుందని ఎంఓటీ, టిఓటిల ద్వారా శిక్షణ ఇస్తారని ఆమె తెలిపారు..యోగాతోనే ప్రశాంత వాతావరణం, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని ఎంపీడీవో తెలిపారు. ప్రతీ ఒక్కరూ యోగాంధ్రాలో పాల్గొని పిలుపునిచ్చారు. జూన్ 16న పెంచలకోన దేవస్థానం నందు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర నిర్వహిస్తున్నామని, ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి జీవీ రమేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ రమేష్ బాబు, సిడిపిఓ సునంద, అంగన్వాడి సూపర్వైజర్ రాజేశ్వరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *