100 పడకల హాస్పిటల్ గా సీహెచ్సీ

ప్రభుత్వానికి నివేదికలు పంపాం

కోవూరు సీహెచ్సీని పరిశీలించిన జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ అధికారిణి

100 పడకల హాస్పిటల్ గా సీహెచ్సీ

  • ప్రభుత్వానికి నివేదికలు పంపాం
  • కోవూరు సీహెచ్సీని పరిశీలించిన జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ అధికారిణి


కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల హాస్పిటల్ గా చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించామని జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ అధికారి పరిమళ తెలిపారు. సీహెచ్ సీని ఆమె తనిఖీ చేసి..ఆపరేషన్ ధియేటర్, ల్యాబ్ లను ఆమె సందర్శించారు.


నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కోఆర్డినేటర్ సర్వీస్ అధికారిణి డాక్టర్ పరిమళ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాలలోని పరిసరాలను, ఆపరేషన్ థియేటర్లో ల్యాబ్, వార్డులను పరిశీలించారు. వైద్యులు, పేషంట్లతో ఆమె మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పరిమిళ మాట్లాడుతూ… ఈ ఆస్పత్రిలో సర్వీసులన్నీ అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆమె వెంట ఆసుపత్రి సూపర్డెంట్ లీలావతి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *