ఉత్తర్వుల్లో పేర్కొన్న హైకోర్ట్ _ _మీడియా సమావేశంలో కుప్పం హాక్సింగ్ స్కూల్ కరస్పాండెంట్
ఆరు వారాల్లో డీఈవో వివరణ ఇవ్వాలి…
- ఉత్తర్వుల్లో పేర్కొన్న హైకోర్ట్
- మీడియా సమావేశంలో కుప్పం హాక్సింగ్ స్కూల్ కరస్పాండెంట్
తమ పాఠశాలపై కక్ష సాధింపులకు పాల్పడవద్దని హాక్సింగ్ స్కూల్ కరస్పాండెంట్ హఫీజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన స్కూల్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కుప్పంలోని హాక్సింగ్ స్కూల్ కరస్పాండెంట్ హఫీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆర్ జేడీ, డిఈఓ ఇచ్చిన ఆర్డర్లను హై కోర్టు డిస్మిస్ చేసిందని తెలిపారు. అధికారాన్ని దుర్వినియోగం చేశారని హై కోర్టు పేర్కొందన్నారు. హాకింగ్స్ పాఠశాలలో 8,9,10 తరగతుల అనుమతులను ఎందుకు రద్దు చేశారని డిఈఓ 6 వారాల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో తెలిపారన్నారు. అధికారులు చేసింది తప్పు అని నిరూపించడానికి హై కోర్టుకు వెళ్ళామని చెప్పారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరోసారి ఇలా పాఠశాలపై కక్ష సాధింపులు చేయవద్దన్నారు. నేను వైసీపీలో ఉన్నాననే కక్షతో, కావాలనే హాకింగ్స్ పాఠశాల పై ఇలాంటి కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు.