చేసిన పాపాలు ఊరికే పోవు

చేసిన పాపాలు ఊరికే పోవు

చేసిన పాపాలు ఊరికే పోవు…

  • మాజీ మంత్రి కాకాణిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్

గత వైసీపీ పాలనలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావని…ఆ పాపాలన్నింటికి ఆయన శిక్ష అనుభవించాల్సిందేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ….గత వైసిపి పాలనలో తప్పుడు కేసులు పెట్టి టిడిపి నాయకులు, కార్యకర్తలను జైలు పాలు చేశాడని ఆరోపించారు. అతనికి వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులు కూడా జైలు బంపిన దుర్మార్గుడని అన్నారు. కాకాణి వేధింపులు తాళలేక పొలాలు బీళ్లు పెట్టుకుని ఊర్లు వదిలి భార్యాబిడ్డలకు దూరంగా కాలం గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పనులు చేసిన కాకాణి నేడు జైలు జీవితం అనుభవించక తప్పదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *