అత్యంత బాధాకరమైన రోజు

మాజీ మంత్రి కాకాణి అరెస్ట్ బాధాకరం

మీడియా సమావేశంలో వైసీపీ సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి

అత్యంత బాధాకరమైన రోజు…

  • మాజీ మంత్రి కాకాణి అరెస్ట్ బాధాకరం
  • మీడియా సమావేశంలో వైసీపీ సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అత్యంత బాధాకరమైన రోజని వైసీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మైనింగ్ కేసులో ఆరోపణలో కాకాణి అరెస్ట్ చేయడం సరికాదన్నారు. పోలీసులు అరెస్ట్ చేశామని చెబుతున్నారే కానీ…అయితే ఆయన్ని ఎక్కడకి తీసుకెళ్లారని స్పష్టత ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాకాణి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. న్యాయ స్థానాల మీద తమకు గౌరవం ఉందని, తప్పకుండా ఈ కేసులో పోరాటం చేస్తామని పర్వతరెడ్డి పేర్కొన్నారు. కాకాణికి తామంతా అండగా ఉంటామని చెప్పారు. నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *