వైసీపీ ఆఫీసుకు చేరుకుంటున్న నేతలు
మాజీ మంత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి, నేతలు
కాకాణి అరెస్టుపై వైసీపీ వ్యూహం ఏంటీ..?
వైసీపీ ఆఫీసుకు చేరుకుంటున్న నేతలు
మాజీ మంత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి, నేతలు
రుస్తుం మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డిని కేరళలో అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ రాత్రికి కాకాణిని కేరళ నుంచి నెల్లూరుకు తీసుకొస్తుండటంతో.. ఆయన్ను అరెస్టు చూపితే.. కోర్టుకు తరలిస్తే.. రిమాండ్ విధిస్తే.. వైసీపీ కార్యాచారణ ఏంటీ..? ఎలాంటి వ్యూహాలు రచించాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అనే వ్యూహాల్లో పార్టీ ముఖ్యనేతలు నిమగ్నమయ్యారు. కాకాణి అరెస్టు విషయం తెలిసిన వెంటనే.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, తదితర ముఖ్యనేతలు నెల్లూరు డైకాస్ రోడ్డులోని వైసీపీ కార్యాలయంకు చేరుకున్నారు. కాకాణి అరెస్టుపై చర్చిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు కూడా వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంకు చేరుకుంటున్నారు. రేపు కాకాణిని అరెస్టు చూపిస్తే.. ఎలాంటి కార్యక్రమాలు, ఆందోళనలు చేపడతారు..? పోలీసులు ఎలా ప్రతిఘటిస్తారు..?, అనేది అటు వైసీపీ శ్రేణులకు, పోలీసులకు పెద్ద సవాల్‌గా మారనుంది.