రైతులకి సూచించిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
డీవీసత్రం తల్లంపాడులో పీఎండీఎస్ సాగు చేసిన పొలాన్ని సందర్శించిన కలెక్టర్
150 ఎకరాలకి సాగునీరు అందించేలా చర్యలు…
- రైతులకి సూచించిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
- డీవీసత్రం తల్లంపాడులో పీఎండీఎస్ సాగు చేసిన పొలాన్ని సందర్శించిన కలెక్టర్
తల్లంపాడులో పీఎండీఎస్ సాగు చేసిన పొలాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలసి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. రైతులు వేసిన పచ్చ రొట్టి పంటను పరిశీలించి… రైతు పొలంలో పచ్చ రొట్టి విత్తనాలను ఆయన రైతులతో కలసి పొలంలో వేశారు.
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం లోని తల్లంపాడు గ్రామంలో పిఎండిఎస్ సాగు చేసిన పొలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. దొరవారిసత్రం మండలం తల్లంపాడు గ్రామంలో పి.యం.డి.ఎస్ పైరు 11 రకాల విత్తనాల్ని గోవర్ధన్ అనే రైతు పొలంలో వేశారు. వీటి వల్ల ఉపయోగాలని గ్రామ రైతులకు ఏపీ సీఎన్ ఎఫ్ డిపిఎం షణ్ముగం, ఏడిఏ అగ్రికల్చర్ అనిత వారు కలెక్టర్ వివరించారు. వీటిని వేసుకొని భూమి సారవంతం అవుతుందని తేమశాతం ఎక్కువ సమయం నిలుపుకుంటుందని తద్వారా ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చని గ్రామంలోని రైతులందరికీ కూడా వివరించారు. గ్రామ రైతులు నెర్రి కాలవ బాగు చేసి గ్రామంలో ఉన్న 150 ఎకరాలకి సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని రైతులు కలెక్టర్ కు తెలియజేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ టన్నులు రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన రైతులకి భరోసా ఇచ్చారు. రైతులు వేసిన పచ్చ రొట్టి పంటను పరిశీలించి… రైతు పొలంలో పచ్చ రొట్టి విత్తనాలను రైతులతో కలసి పొలంలో వేశారు. కలెక్టర్ వెంట ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది, దొరవారిసత్రం మండల వ్యవసాయ అధికారి జ్యోతిర్మయి, మండల గ్రామస్థాయి అన్ని శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.