ఘనంగా కామాక్షితాయి సింహవాహనోత్సవం
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కామాక్షితాయిన దర్శించుకుని పునీతులైన భక్తజనం
కామాక్షితాయి చిద్విలాసం…
- ఘనంగా కామాక్షితాయి సింహవాహనోత్సవం
- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
- కామాక్షితాయిన దర్శించుకుని పునీతులైన భక్తజనం
శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సింహ వాహనోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. వేమిరెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడలో కొలువుతీరిన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనోత్సవం వైభవంగా జరిగింది.. నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, అధికారులు, మరియు కమిటీ సభ్యులు అతిధులను ఆలయ మర్యాదలతో స్వాగతించి, స్వామి వార్ల దర్శనం కల్పించి.. ప్రత్యేక పూజలు జరిపించి శ్రీవార్ల శేష వస్త్రములు ప్రసాదములు అందజేశారు.. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు అతిథులకు వేద ఆశీర్వచనం అందజేశారు.. అమ్మవారు సింహవాహనంపై ఊరేగదు భక్తులకు దర్శనమిచ్చారు.. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి..