కోవూరు లో భారీ వర్షం – భారీ ఈదురు గాలుల వల్ల కరెంట్ కోత
నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలో ఈదూరు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని వాగులు, రోడ్లు, కాలువలు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణం వల్ల మండలంలో కరెంట్ కోత నెలకొంది. భారీ ఈదురు గాలుల వల్ల కరెంటు స్తంభాలకు ఉన్న వైర్లు ఒకదాని ఒకటి అంటుకొని మంటలు వ్యాపించాయి.