మహానాడు పెత్తనం మనదే

మహానాడు నిర్వహణ కమిటీలో నెల్లూరు నేతలు

పది మందికి అవకాశం కల్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం

జాబితాను విడుదల చేసిన టీడీపీ రాష్ట్ర కార్యాలయం

మహానాడు పెత్తనం మనదే…

  • మహానాడు నిర్వహణ కమిటీలో నెల్లూరు నేతలు
  • పది మందికి అవకాశం కల్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం
  • జాబితాను విడుదల చేసిన టీడీపీ రాష్ట్ర కార్యాలయం

యాంకర్ పార్ట్ :
2025 మహానాడును విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపీఠ వేశారు. పలు కీలక విభాగాలలో పది మంది అవకాశం కల్పిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యాలయం జాబితాను విడుదల చేసింది.

వాయిస్ వోవర్ :
రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులకు, అధిష్ఠానం ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది. తెలుగుదేశం పార్టీ కేడర్ కు పెద్ద పండుగలా భావించే మహానాడు ఈనెల 27 నుంచి 29 వరకు కడప వేదికగా జరగనుంది. ఈ మహానాడు నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ అధిష్ఠానం అనేక విభాగాలకు కమిటీలను నియమించింది. ఈ కమిటీలలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురికి స్థానం కల్పిస్తూ జాబితాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు ప్రకటించారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్రను జన సమీకరణ కమిటీ కో కన్వీనర్, సమన్వయ కమిటీ, సభా ప్రాంగణ పర్యవేక్షణ కమిటీ సభ్యులుగా నియమించారు. ఆర్ధివ వనరుల కమిటీ సభ్యులు, రవాణా కమిటీ కన్వీనర్ గా మంత్రి పొంగూరు నారాయణను ఎంపిక చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆర్ధిక వనరుల కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులుగా నియమించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఫోటో ప్రదర్శన కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. తీర్మానాల కమిటీ సభ్యులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భోజనాల ఏర్పాట్ల కమిటీ సభ్యులుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పత్రికా, మీడియా, సోషల్ మీడియా కమిటీ సభ్యులుగా ఆక్వా కల్చర్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డిలను నియమించారు. రవాణా కమిటీ కన్వీనర్ గా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, వాహనాల పార్కింగ్ కమిటీ సభ్యులుగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి, రక్తదానం, మెడికల్ క్యాంప్ కమిటీ కో కన్వీనర్ గా డాక్టర్ జెడ్ శివ ప్రసాద్, సాంస్కృతిక కార్యక్రమాల‌ కమిటీ సభ్యులుగా దోర్నాల హరిబాబులను ఎంపిక చేశారు. 2025 మహానాడును విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపీఠ వేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *